Hydra: పోచారం మున్సిపాలిటీలోకి హైడ్రా ఎంట్రీ

Hydra Enters Pocharam Municipality Demolishes Illegal Construction
  • అక్రమంగా నిర్మించిన ప్రహరీ కూల్చివేత
  • ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్
  • రికార్డులు పరిశీలించకుండానే కూల్చివేశారంటూ ఓనర్ ఆవేదన 
ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తాజాగా పోచారం మున్సిపాలిటీలో కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించి ఏడు ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహరీని ఈరోజు ఉదయం కూల్చివేసింది. ప్లాట్ యజమానుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇటీవల దివ్యానగర్ లో భారీ ప్రహరీని కూల్చివేసిన హైడ్రా అధికారులు ఈ రోజు ఏకశిలా నగర్ లో ఆక్రమణలను తొలగించారు.

కొర్రెముల ఏకశిలా నగర్ లో సర్వే నెంబర్ 740, 741, 742 లలో 7.16 ఎకరాల భూమి తనదేనంటూ నూనె వెంకటనారాయణ అనే వ్యక్తి ప్రహరీ నిర్మించాడు. అయితే, తప్పుడు పత్రాలు సృష్టించి వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. రికార్డులు అన్నీ పరిశీలించాకే తాము ప్లాట్లు కొనుగోలు చేశామని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ హైడ్రా కమిషనర్ ను ఆశ్రయించారు.

దీంతో హైడ్రా బృందం ఏకశిల వెంచర్లో 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చివేసింది. హైడ్రా చర్యలతో ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా.. రికార్డులు పరిశీలించకుండానే అధికారులు తమ వ్యవసాయ భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారని నూనె వెంకటనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
Hydra
Nune Venkata Narayana
Hyderabad Metropolitan Development Authority
Pocharam Municipality
Illegal construction demolition
encroachment
Ekashila Nagar
Plot Owners Association
Telangana government
Land dispute

More Telugu News