Peter Hegseth: అణుకేంద్రాల ధ్వంసమే టార్గెట్.. ఇరాన్ తో యుద్ధం చేయబోం: అమెరికా

Iran Nuclear Program Targeted by US Says No War Intended
--
ఇరాన్ లోని అణు కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా బాంబు దాడులు చేపట్టామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఆ దేశంతో యుద్ధం  చేసే ఆలోచన తమకు లేదన్నారు. అణు ఒప్పంద చర్చలకు ఇరాన్ అంగీకారం తెలిపేలా చేయడానికే దాడులు చేశామన్నారు. ఇరాన్ తో యుద్ధం చేసే ఉద్దేశం కానీ, ఆ దేశంలో నాయకత్వం మార్చే ఉద్దేశం కానీ లేదని తాజాగా స్పష్టం చేశారు.

ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై 14 బంకర్‌ బస్టర్‌ బాంబులతో దాడులు చేశామని అమెరికా త్రివిధ దళాల అధిపతి, వైమానిక దళాధిపతి డాన్‌ కెయిన్‌ వివరించారు. శుక్రవారం మిస్సోరీలోని ఎయిర్ బేస్ నుంచి రెండు బీ2 బాంబర్లను పంపించామని, అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేసి అవి క్షేమంగా తిరిగి వచ్చాయని వివరించారు. ఈ దాడి సమయంలో ఇరాన్‌ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదని వివరించారు.
Peter Hegseth
Iran
Nuclear Program
US Military
Bunker Buster Bombs
Nuclear Agreement
Don Kain
B2 Bombers
Missori Airbase

More Telugu News