Prashanthi Reddy: బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన

- ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న ఎమ్మెల్యే
- పాప బాధ్యత తానే తీసుకుంటానని వెల్లడి
- కోలుకున్నాక చిన్నారిని చదివిస్తానని వివరణ
ఫోన్ దొంగిలించిందనే ఆరోపణలతో బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. బాలిక పరిస్థితి చూసి చలించిపోయిన ఎమ్మెల్యే.. బాలిక బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఇందుకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించాలని స్థానిక నేతలకు సూచించారు. కోలుకున్నాక వేమిరెడ్డి ట్రస్ట్ ద్వారా బాలిక బాగోగులు చూసుకుంటామని, చదువుతో పాటు పూర్తి బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సూచనలతో టీడీపీ స్థానిక నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కల్యాణ్ రెడ్డి, పవన్ రెడ్డి, షేక్ ఇంతియాజ్ బాధిత బాలికను నెల్లూరుకు తరలించి అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.