Aamir Khan: మహేశ్ బాబు మనసు దోచిన ఆమిర్ కొత్త సినిమా

Aamir Khans Sitare Zameen Par Impresses Mahesh Babu
  • 'సితారే జమీన్ పర్' ఒక అద్భుతమన్న ప్రిన్స్
  • సినిమా అద్భుతంగా ఉందంటూ ఎక్స్‌లో పోస్ట్
  • నవ్విస్తూ, ఏడిపిస్తూ చప్పట్లు కొట్టిస్తుందన్న మహేశ్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్‌’ పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాను వీక్షించిన ఆయన, తన అనుభూతిని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ నవ్విస్తుందని, కంటతడి పెట్టిస్తుందని, అదే సమయంలో చప్పట్లు కొట్టేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

మహేశ్ బాబు తన పోస్ట్‌లో.. “‘సితారే జమీన్ పర్‌’ ఒక అద్భుతమైన సినిమా. ఆమిర్ ఖాన్ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఒక క్లాసిక్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు” అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆయన మాటలు సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

'సితారే జమీన్ పర్‌' చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ‘తారే జమీన్ పర్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ప్రచారం పొందింది. మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్న కొందరికి ఒక కోచ్ బాస్కెట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో ఆమిర్ ఖాన్ కోచ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
Aamir Khan
Sitare Zameen Par
Mahesh Babu
Bollywood Movie
Tollywood
Movie Review
Basketball
Sports Movie
तारे ज़मीन पर
New Movie

More Telugu News