Gold Price: గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price Drops Significantly Good News for Buyers
  • కొన్ని రోజులుగా పెరుగుతున్న రేట్లకు నేడు బ్రేక్
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 తగ్గుదల
  • 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.820 తగ్గుదల
కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఊరటనిచ్చాయి. లక్ష రూపాయల మార్కును దాటి సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గముఖం పట్టడం గమనార్హం. గత వారం రోజులుగా పెరుగుతున్న ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్న పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే.

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఈనాటి ధరల వివరాలను పరిశీలిస్తే... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, నిన్నటి రేటు రూ.93,300 కాగా, దానిపై రూ.750 తగ్గి నేడు రూ.91,550 గా నమోదైంది. ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది.

అదేవిధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా గణనీయంగా తగ్గింది. నిన్న రూ.1,00,690 వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర, నేడు రూ.820 తగ్గి రూ.99,870 కి చేరింది. దీంతో లక్ష మార్కు దాటిన ధర మళ్లీ కాస్త కిందికి వచ్చింది.

బంగారంతో పాటు వెండి ధరలోనూ గణనీయమైన తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.1000 తగ్గి, ప్రస్తుతం రూ.1,19,000 వద్ద కొనసాగుతోంది.
Gold Price
Gold Rate Today
Hyderabad Gold Price
Vijayawada Gold Price
22 Carat Gold Price
24 Carat Gold Price
Silver Price Today
Gold Price Drop
Commodity Market
Gold Market

More Telugu News