Mohan Babu: రిపోర్టర్‌పై దాడి కేసు.. మోహన్ బాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

Mohan Babu Petition Hearing Adjourned in Reporter Assault Case
  • విలేకరిపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై కేసు నమోదు
  • పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు కొట్టివేతకు పిటిషన్
  • విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం
ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు సంబంధించిన కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్‌బాబు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా, న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది.

గతంలో రంజిత్ అనే విలేకరిపై దాడి చేశారన్న ఆరోపణలతో మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుకు సంబంధించి మోహన్‌బాబుకు ఇదివరకే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Mohan Babu
Manchu Mohan Babu
Telangana High Court
Pahadi Shareef Police Station

More Telugu News