Anjana Devi: అంజనాదేవి ఆరోగ్యంపై వదంతులు.. స్పందించిన నాగబాబు

Anjana Devi Health Rumors Addressed by Naga Babu
  • అంజనాదేవి ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు
  • మంగళవారం ఉదయం నుంచి మొదలైన ప్రచారం
  • ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు
  • వదంతులను ఖండించిన తనయుడు నాగబాబు
  • అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని స్పష్టం చేసిన నాగబాబు
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యంపై మంగళవారం ఉదయం నుంచి కొన్ని వదంతులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆమె అనారోగ్యానికి గురయ్యారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాబినెట్ మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారని వార్తలు రావడంతో అభిమానులు, శ్రేయోభిలాషులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు ఈ అంశంపై స్పందించారు. తన తల్లి అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

మంగళవారం ఉదయం కొందరు సామాజిక మాధ్యమం యూజర్లు అంజనాదేవి ఆరోగ్యం బాగోలేదని, ఆమె ఆసుపత్రిలో చేరారని తప్పుడు ప్రచారం చేశారు. 'చిరంజీవి తల్లికి అస్వస్థత', 'చిరంజీవి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు' అంటూ ప్రచారం జరిగింది. దీంతో నాగబాబు స్పందించారు.

"మా అమ్మ అంజనాదేవి గారి ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె అనారోగ్యంతో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దు" అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్ధారించుకోకుండా వార్తలు ప్రచారం చేయవద్దని పలువురు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
Anjana Devi
Chiranjeevi mother
Naga Babu
Anjana Devi health
Chiranjeevi family

More Telugu News