Ambati Rambabu: గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు

- వైసీపీలో కీలక నియామకం
- అంబటి రాంబాబుకు గుంటూరు పశ్చిమ బాధ్యతలు
- వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల
వైసీపీలో కీలక నియామకం జరిగింది. వైసీపీ అధినేత జగన్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబును గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్త (కోఆర్డినేటర్)గా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అంబటి రాంబాబు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన, 2024 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అంబటి రాంబాబు మొదటి నుంచి పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు.
కాగా, ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న వ్యవహారంలో అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేశారు.
కాగా, ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న వ్యవహారంలో అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేశారు.