Amazon: ప్రైమ్ డే సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్

Prime Day 2025 Amazon Sale from July 12 to 14
  • మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్
  • జులై 12 నుంచి 14వరకు ప్రైమ్ డే 2025 సెల్స్ ఈవెంట్
  • 124 దేశాల్లో ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు అమెజాన్ వెల్లడి
అమెజాన్ తన వినియోగదారులకు మరో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రైమ్ డే 2025 సేల్స్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. జులై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు ప్రైమ్ డే సేల్స్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అమెజాన్ అధికారికంగా వెల్లడించింది.

ఈ సేల్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుందని, 124 దేశాలలో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. సోనీ, డైసన్, కీహ్ల్స్, లెవీస్, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, కిచెన్, బ్యూటీ, అపారెల్, బ్యాక్-టు-స్కూల్ సప్లైస్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్, బెస్ట్ సెల్లింగ్ టాయ్స్ వంటి 35 కంటే ఎక్కువ విభాగాలలో మిలియన్ల డీల్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

'టు డేస్ బిగ్ డీల్స్' పేరుతో ప్రతి రోజు అర్ధరాత్రి పీడీటీ నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయని, పాఠశాల సామగ్రిపై 40 శాతం వరకు, అమెజాన్ బ్రాండ్లపై 30 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది.

భారతదేశంలో ప్రైమ్ సభ్యులు సేల్‌లో పది లక్షలకు పైగా ఉత్పత్తులపై అదే రోజు ఉచిత డెలివరీని పొందవచ్చునని, 40 లక్షలకు పైగా ఉత్పత్తులపై తదుపరి రోజు డెలివరీ సౌకర్యం కలదని, 20 వేలకు పైగా ఉత్పత్తులను 4 గంటల్లో డెలివరీ చేయగలమని అమెజాన్ వెల్లడించింది. గత సంవత్సరం ప్రైమ్ డేలో దేశంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని, 200 మిలియన్ ఐటెమ్స్ విక్రయించబడ్డాయని, SMBలు (చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు) నిమిషానికి 1600 యూనిట్లు అమ్ముడయ్యాయని అమెజాన్ తెలిపింది. 
Amazon
Prime Day 2025
Amazon Prime Day
Prime Day Sale
Amazon India
Electronics deals
Discount sales
Online shopping
E-commerce
Deals and offers

More Telugu News