Rajkummar Rao: 'గంగూలీ' పాత్రలో రాజ్‌కుమార్ రావ్ ఖరారు

Rajkummar Rao Confirmed for Sourav Ganguly Biopic Role
  • తొలిసారిగా గంగూలీ బయోపిక్ పై స్పందించిన నటుడు రాజ్ కుమార్ రావ్ 
  • జాతీయ మీడియాతో మాట్లాడుతూ గంగూలీ బయోపిక్ లో నటిస్తున్నట్లు వెల్లడించిన రాజ్ కుమార్ రావు
  • గంగూలీ బయోపిక్ లో నటించడం పెద్ద బాధ్యతగా పేర్కొన్న రాజ్ కుమార్ రావ్
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆశించిన విధంగానే ఆయన బయోపిక్‌లో నటుడు రాజ్‌కుమార్ రావ్ నటించనున్నారు. 2021 నుంచే గంగూలీ బయోపిక్ పనులు ప్రారంభం కాగా, తన పాత్ర పోషించేందుకు రాజ్‌కుమార్ రావ్ అయితే బాగుంటుందని గంగూలీ ఒక సందర్భంలో అభిప్రాయపడ్డారు. దాంతో రాజ్‌కుమార్ రావే హీరో అని అభిమానులు భావిస్తున్నారు.

దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా షూటింగ్ కూడా ప్రారంభమైందంటూ బాలీవుడ్‌లో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లవ్ రంజన్ నిర్మిస్తున్నారు.

అయితే దీనిపై తొలిసారిగా నటుడు రాజ్ కుమార్ రావ్ స్పందించారు. ఆ సినిమాలో తాను నటిస్తున్నట్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. తెరపై గంగూలీ మాదిరిగా కనిపించేందుకు కొంచెం ఒత్తిడి ఉందని అన్నారు. గంగూలీ బయోపిక్‌లో నటించడం ఒక పెద్ద బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం తన భార్య నుంచి బెంగాలీ భాషను నేర్చుకున్నానని రాజ్‌కుమార్ రావ్ తెలిపారు.

గంగూలీ క్రికెట్‌లో రెండు దశాబ్దాల పాటు సత్తా చాటి 2008లో ఆటకు వీడ్కోలు పలికారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా, ఆ తర్వాత మూడేళ్ల పాటు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. 
Rajkummar Rao
Sourav Ganguly
Ganguly biopic
Rajkummar Rao Ganguly
Vikramaditya Motwane
Bollywood
BCCI
Cricket
Love Ranjan
Bengal Cricket Association

More Telugu News