Banoth Kirya: రైతు భరోసా డబ్బుల కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు

- కన్నతండ్రిపై పాశవికంగా దాడి చేసిన కుమారుడు
- భూమి తన పేరిట రాయలేదన్న కోపం కూడా కారణం
- మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో ఘటన
- పోలీసుల అదుపులో నిందితుడు
డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో తండ్రి నాలుక కోశాడో కుమారుడు. మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ కిర్యాకు ఇద్దరు కుమారులు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమచేసింది. ఈ క్రమంలో కిర్యా ఖాతాలో రూ.9 వేలు జమ అయ్యాయి.
ఆ డబ్బులు తనకు ఇవ్వాలని చిన్న కుమారుడు సంతోష్ తండ్రిని అడిగాడు. అయితే, ఆ డబ్బుల్లో రూ. 5 వేలు ఆసుపత్రి ఖర్చుల కోసం ఉపయోగించానని, మిగిలిన రూ. 4 వేలు తీసుకోవాలని కిర్యా కోరాడు. తండ్రి సమాధానంతో సంతోష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. భూమిని తన పేరున రిజిస్టర్ చేయలేదన్న పాత కక్షను కూడా మనసులో పెట్టుకుని కొడవలితో తండ్రి నాలుకను కోసేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిర్యాను కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన నాలుకకు కుట్లు వేసి చికిత్స అందించారు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సంతోష్‌ను అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.