Telangana Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

--
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అనగా సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ టి.మాధవీదేవి తీర్పు ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరగా.. రిజర్వేషన్లను అమలు చేసేందుకు 30 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 3 నెలల సమయం ఇస్తూ సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెలువరించింది.