Sana Khan: నటి సనా ఖాన్ కు మాతృవియోగం.. సనా భావోద్వేగ పోస్ట్

- అనారోగ్యంతో మృతి చెందిన సనా ఖాన్ తల్లి సయీదా
- సోషల్ మీడియా ద్వారా తల్లి మరణవార్తను తెలిపిన సనా ఖాన్
- సంతాపం తెలుపుతున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు
బాలీవుడ్ నటి సనా ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి, శ్రీమతి సయీదా ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తను సనా ఖాన్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
"నా ప్రియమైన అమ్మ, శ్రీమతి సయీదా, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ఇషా నమాజ్ అనంతరం ఓషివారా ఖబ్రస్థాన్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. అమ్మ ఆత్మశాంతి కోసం మీరంతా ప్రార్థించాలని కోరుతున్నాను" అంటూ సనా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.
ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు సనా ఖాన్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు మనోధైర్యాన్ని అందిస్తున్నారు.
వివాహం తర్వాత సినిమాలకు దూరం..
'బొంబై టు గోవా' చిత్రంలోని ఐటమ్ సాంగ్‌తో సనా ఖాన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన 'జైహో' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన 'కత్తి' చిత్రంలోనూ, నాగార్జున 'గగనం', మంచు మనోజ్ 'మిస్టర్ నూకయ్య' వంటి సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హిందీ బిగ్ బాస్ షో ద్వారా కూడా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తున్న తరుణంలోనే ఇస్లామిక్ గురువు ముఫ్తీ అనాస్ సయ్యద్‌ను వివాహం చేసుకుని, నటనకు దూరమయ్యారు. ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. సనా ఖాన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను, విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు.