Parivar Malayalam Movie: తండ్రి డైమండ్ రింగు కోసం కొడుకుల కొట్లాట: ఓటీటీలో మలయాళ మూవీ!

Pariwar Movie Update
  • మలయాళంలో రూపొందిన 'పరివార్'
  • కామెడీ టచ్ తో సాగే ఫ్యామిలీ కంటెంట్ 
  • సరదాగా నవ్వించే సన్నివేశాలు 
  • ఆలోచింపజేసే సందేశం 

మలయాళ కంటెంట్ కి ఓటీటీ సెంటర్లలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. థిల్లర్ కథలు .. పోలీస్ కథలతో పాటు, కామెడీ టచ్ తో కూడిన ఫ్యామిలీ ముచ్చట్లను అందించడంలోనూ వాళ్లు తమదైన మార్క్ చూపిస్తూ ఉంటారు. అలా మలయాళంలో కామెడీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన సినిమానే 'పరివార్'.

కుటుంబం అంటే నాలుగు గోడలు .. ఒక పైకప్పు కాదు, బంధాలకు .. అనుబంధాలకు నిలయాలు అని ఒకప్పుడు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి కుటుంబాలు కనిపించడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు డబ్బే ప్రధానం .. అది ఎవరి దగ్గరుంటే వాళ్లపై ప్రేమ నటిస్తారు .. అది లేకపోతే నటించడం మానేస్తారు అంతే. ఇదే విషయంతో వినోదభరితంగా తెరకెక్కిన ఈ సినిమా, మార్చి 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 24 నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో అందుబాటులోకి వచ్చింది.      

భాస్కర పిళ్లై కి 90 ఏళ్లు దాటిపోతాయి.. చావుకి చాలా దగ్గరగా వెళ్లిపోతాడు. ఆయన నలుగురు కొడుకులు చాలా బాధపడిపోతూ ఉంటారు. తండ్రి గురించి కాదు .. ఆయన చేతికున్న 'డైమండ్ రింగ్' గురించి. ఎవరికివారు దానిని దక్కించుకోవడానికి ఆరాటపడిపోతుంటారు. అందుకోసం వాళ్లు వేసే మాస్టర్ ప్లాన్స్ ఏమిటి? చివరికి ఆ డైమండ్ రింగ్ ఎవరికి దక్కుతుంది? అనేది కథ. 
వినోదం .. సందేశం కలగలిసిన ఈ కథ, ఫ్యామిలీతో కలిసి చూడవలసిందే. 


Parivar Malayalam Movie
Malayalam cinema
OTT release
Amazon Prime
Family drama
Comedy movie
Diamond ring
Movie review
Bhaskara Pillai
Family relationships

More Telugu News