Jagan: సింగయ్య మృతి కేసు... క్వాష్ పిటిషన్ వేసిన జగన్

- జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా విషాదం
- జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి
- ఈ కేసులో ఏ2గా జగన్
- ఇప్పటికే డ్రైవర్ అరెస్ట్
- జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా విషాదకర ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం ముగ్గరు వ్యక్తులు ఈ పర్యటన సందర్భంగా చనిపోయారు. జగన్ వాహనం చక్రాల కింద్ర పడి సింగయ్య అనే వ్యక్తి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి జగన్ తో పాటు, కారు డ్రైవర్, పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదయింది. ఈ కేసులో జగన్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా సీజ్ చేశారు.
ఈ నేపథ్యంలో జగన్ తో పాటు కేసులోని ఇతర నిందితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు... రేపు విచారణ జరుపుతామని తెలిపింది.