Prasad Babu: శోభన్ బాబుగారి మాట వినకపోతే ఏమైపోయేవాడినో: నటుడు ప్రసాద్ బాబు

Prasad Babu Interview
  • ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తో కలిసి నటించానన్న ప్రసాద్ బాబు   
  • కృష్ణగారు వరుస అవకాశాలు ఇప్పించారు
  • కృష్ణంరాజు గారు కూడా ఎంకరేజ్ చేశారు
  • శోభన్ బాబు గారు గొప్ప సలహా ఇచ్చారన్న ప్రసాద్ బాబు    

ప్రసాద్ బాబు .. నిన్నటి తరం నటుడు. ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. తాజాగా ఆయన 'ఐడీ పోస్ట్ మిక్స్' అనే యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. "నేను ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కలిసి నటించాను. వాళ్లిద్దరి పట్ల భయమూ .. గౌరవము ఉండేవి. వాళ్లతో నటించడం వల్లనే, నేను ఏ పాత్రనైనా చేయగలను అనే నమ్మకం కలిగింది" అని అన్నారు.

ఇక కృష్ణగారు .. శోభన్ బాబు గారు .. కృష్ణంరాజు గారు నన్ను ఒక సొంత తమ్ముడి మాదిరిగా చూసుకునేవారు. కృష్ణగారు వరుస సినిమాలలో నాకు అవకాశాలు ఇప్పించారు. అలాగే కృష్ణంరాజుగారు కూడా. శోభన్ బాబుగారు కూడా ముఖ్యమైన పాత్రలకు నన్ను సిఫార్స్ చేసేవారు. డేట్స్ గురించి నేను అడిగితే, ముందు ఒప్పుకో తరువాత చూసుకుందామని చెప్పేవారు" అని అన్నారు. 

"నేను చెన్నైలో స్థలం అమ్ముకుని హైదరాబాద్ వెళ్లిపోదామని అనుకున్నాను. ఆ విషయం శోభన్ బాబుగారికి చెప్పాను. అలా స్థలం అమ్మితే ఆ డబ్బు ఖర్చు అవుతుంది .. హైదరాబాద్ వెళ్లి సంపాదించుకుని అక్కడ స్థలం కొనుక్కో .. దీనిని మాత్రం కదిలించకు అన్నారు. దాంతో ఆ ఆలోచన మానుకుని హైదరాబాద్ వెళ్లాను. అనుకున్నట్టుగా అక్కడ అవకాశాలు రాలేదు. దాంతో తిరిగి చెన్నై వచ్చాను .. ఇక్కడ సీరియల్స్ తో బిజీగానే ఉన్నాను. శోభన్ బాబుగారి మాట వినడం వలన, తిరిగి రాగలిగాను. లేకపోతే ఏమై పోయేవాడినో" అని చెప్పారు.

Prasad Babu
Sobhan Babu
Telugu actor
Krishna
Krishnam Raju
NTR
ANR
Chennai
Hyderabad
Telugu cinema

More Telugu News