Special OPS 2: ఓటీటీకి మరో స్పై యాక్షన్ థ్రిల్లర్!

Special Ops 2 Update
  • కేకే మీనన్ ప్రధాన పాత్రగా 'స్పెషల్ ఓపీఎస్ 2'
  • సైబర్ టెర్రరిజం చుట్టూ తిరిగే కథ 
  • కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ 
  • జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్

ఓటీటీ వైపు నుంచి ఎక్కువ మార్కులు కొట్టే సిరీస్ లు గా, క్రైమ్ థ్రిల్లర్ లు .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు .. స్పై యాక్షన్ థ్రిల్లర్లు ఎక్కువగా కనిపిస్తాయి. భారీతనంతో .. డిఫరెంట్ గా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలతో ఈ సిరీస్ లు అలరిస్తూ ఉంటాయి. అందువలన ఈ తరహా కంటెంట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నాయి. 

అలా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన సిరీస్ లలో ఒకటిగా 'స్పెషల్ ఓపీఎస్ 2' కనిపిస్తుంది. 2020లో  వచ్చిన 'స్పెషల్ ఓపీఎస్' కీ .. 2021లో వచ్చిన 'స్పిన్ ఆఫ్ స్పెషల్ ఓపీఎస్ 1.5'కి ఇది సీక్వెల్. గతంలో వచ్చిన ఎపిసోడ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందువలన సీజన్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సీజన్ 2ను జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. 

సీజన్ 2 సైబర్ - టెర్రరిజం అనే కథాంశంతో కొనసాగనుంది. గూఢచారి హిమ్మత్ సింగ్ గా మరోసారి కేకే మీనన్ కనిపించనున్నారు. నీరజ్ పాండే దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్ లో, ప్రకాశ్ రాజ్ .. తాహిర్ బాసిన్ .. సయామీ ఖేర్ .. ముజమిల్ ఇబ్రహీం .. తోతారాం చౌదరి ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి మరి. 

Special OPS 2
KK Menon
Special OPS
Spy Action Thriller
Cyber Terrorism
Neeraj Pandey
Prakash Raj
Disney Plus Hotstar

More Telugu News