Viratapalem: ఇటు 'విరాటపాలెం'.. అటు 'కానిస్టేబుల్ కనకం' .. ఎక్కడో ఏదో జరిగింది!

Viratapalem Series Update
  • 'విరాటపాలెం' సిరీస్ ను ప్రకటించిన జీ 5
  • ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • ఈ సిరీస్ రిలీజ్ ఆపాలంటూ కోర్టుకి వెళ్లిన ఈటీవీ విన్

జీ 5 ఓటీటీలో ఈ నెల 27వ తేదీ నుంచి 'విరాటపాలెం -పీసీ మీనా రిపోర్టింగ్'నే సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ కొన్ని రోజులుగా నడుస్తున్నాయి. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో, అభిజ్ఞ - చరణ్ లక్కరాజు ప్రధానమైన పాత్రలను పోషించారు. 


1980లలో .. ఒక మారుమూల గ్రామంలో నడిచే కథ ఇది. ఆ గ్రామంలో పెళ్లి చేసుకోవాలనుకున్న యువతులు, పెళ్లికూతురుగా ఉండగానే అనుమానాస్పదంగా చనిపోతూ ఉంటారు. అందుకు కారణం ఏమిటనేది ఎవరికీ అర్థం కాదు.  తమ గ్రామానికి అదొక శాపం కావొచ్చని నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక లేడీ కానిస్టేబుల్ వస్తుంది. ఆమె రాకతో ఏం జరుగుతుందనేది కథ.   

అయితే ఇప్పుడు ఈ సిరీస్ రిలీజ్ ను నిలిపివేయాలని కోరుతూ, ఈటీవీ విన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ ఫ్లాట్ ఫామ్ పై త్వరలో విడుదల కానున్న 'కానిస్టేబుల్ కనకం' కథతోనే 'విరాటపాలెం' సిద్ధమైందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. 'కానిస్టేబుల్ కనకం'గా వర్ష బొల్లమ్మ నటించిన ఈ సిరీస్ కి, ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. మరి ఒకే కథతో రూపొందిన ఈ రెండు సిరీస్ ల విషయం ఎటువైపు వెళుతుందో చూడాలి. 


Viratapalem
Viratapalem series
Constable Kanakam
ZEE5
ETV Win
Varsha Bollamma
Telugu series
OTT platforms
Supernatural thriller
Telugu movies

More Telugu News