Ramachandra: వేషాలు లేవు .. డబ్బులూ లేవు .. ఏం చేయాలి?: కమెడియన్ రామచంద్ర

Comedian Ramachandra Interview
  • ఆరిస్టుగా ఎంట్రీ ఈజీగానే జరిగింది 
  • బిజినెస్ లో నష్టాలు చూశాను  
  • అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి
  • అప్పు చేసినా తీర్చే పరిస్థితి లేదు 
  • ప్లీజ్ అవకాశాలు ఇవ్వండి అంటున్న రామచంద్ర

ఒకప్పుడు వెండితెరపై సందడి చేసిన కమెడియన్ రామచంద్ర. చాలా సినిమాలు చేసిన ఆయన, ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఆయన 'సుమన్ టీవీ'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. "నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది. 'నిన్ను చూడాలని' సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. 'ఆనందం' .. 'వెంకీ' సినిమాలు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి" అని అన్నాడు. 

" ఆరంభంలో అవకాశాలు ఈజీగానే వచ్చినా, ఆ తరువాత అవకాశాలను సంపాదించుకోవడం కోసం చాలానే కష్టాలు పడ్డాను. సంపాదించిన డబ్బులు ఒక బిజినెస్ లో పోగొట్టుకున్నాను. రోడ్డు ప్రమాదానికి గురికావడం వలన మూడేళ్ల పాటు గ్యాప్ వచ్చింది. సంపాదించినప్పుడు దాచుకోకపోవడం వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అవన్నీ కూడా ఫేస్ చేశాను. నా పరిచయస్తులందరి దగ్గర అప్పులు చేశాను" అని చెప్పాడు. 

" కొంతమంది దగ్గర చేసిన అప్పు తీర్చాను .. ఇంకా తీర్చవలసినవి ఉన్నాయి. అప్పు తీర్చాలని నాకు ఉంటుంది. కానీ తీర్చే మార్గమే కనిపించడం లేదు. అవకాశాలు రావడం లేదు. అవకాశాల కోసం వెళితే, నా పేరు .. నా ఫేస్ కూడా గుర్తులేవని అనడం నాకు మరింత బాధ కలిగిస్తోంది. అయినా ఇంకా అవకాశాలు వస్తాయనే ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నేను ఆశించేది  జాలి .. సానుభూతి కాదు .. అవకాశాలు ఇవ్వమనే కోరుతున్నాను" అని అన్నాడు.  

Ramachandra
Comedian Ramachandra
Telugu Comedian
Telugu Cinema
Ninnu Choodalani Movie
Anandam Movie
Venky Movie
Suman TV Interview
Telugu Film Industry
Movie Opportunities

More Telugu News