Kanakadurga Temple: బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. అమ్మవారికి తొలి సారె సమర్పించిన ఈవో

Kanakadurga Temple Varahi Utsavalu Begin in Vijayawada
  • ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు
  • నెలరోజుల పాటు జరుగనున్న వారాహి ఉత్సవాలు
  • ఈ నెల 29న తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ
  • జులై 8,9,10 తేదీలలో శాఖాంబరి ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే వారాహి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీ శీనానాయక్ దంపతులు అమ్మవారికి తొలి సారెను సమర్పించారు.

మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు, అమ్మవారికి శేష వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ మాట్లాడుతూ, తమ చేతుల మీదుగా అమ్మవారికి తొలి సారె సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు సారె సమర్పణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ నెల 29న అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. జులై 8, 9, 10 తేదీలలో శాఖాంబరి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 
Kanakadurga Temple
Vijayawada
Varahi Utsavalu
Shena Naik
Indrakilaadri
Telangana Bonam
Shakambari Utsavalu
Andhra Pradesh Temples

More Telugu News