Nimmavastugilage Neeve Javabdararu: 'మీ వస్తువులకు మీరే బాధ్యులు' ఓటీటీలో కన్నడ క్రైమ్ డ్రామా!

Nimma Vaasthugalige Neeve Javaabdaararu Movie Update
  • కన్నడలో రూపొందిన సినిమా
  • అక్కడి థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్  
  • ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరిగే కథ
  • ఈ నెల 27 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్  
     
 పబ్లిక్ తో ముడిపడి ఉన్న ఏ ప్రదేశాలకు వెళ్లినా, 'మీ వస్తువులకు మీరే బాధ్యులు' అనే బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వాక్యాన్ని టైటిల్ గా తీసుకుని కన్నడలో రూపొందిన సినిమానే 'నిమ్మ వస్తుగళిగే నీవే జవాబుదారారు'. కేశవ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా, జనవరిలో అక్కడ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'సన్ నెక్స్ట్' ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 'సన్ నెక్స్ట్' వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా వదిలారు. ఇది ఆంథాలజీ కాన్సెప్ట్ తో నిర్మితమైన సినిమా. బెంగుళూరు నేపథ్యంలో .. ఒక ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

ముగ్గురు వ్యక్తులు .. ఒక్కొక్కరూ ఒక్కో చిత్రమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వాళ్లలో ఒకరు కోటీశ్వరుడు. అయినా తన కంటికి నచ్చిన వస్తువులను కాజేస్తూ ఉంటాడు. అదొక మానసిక స్థితి అంతే. అలాగే విలక్షణమైన స్వభావం కలిగిన మరో ఇద్దరూ. ఈ ముగ్గురి జీవితాలు ఏ తీరానికి చేరుకున్నాయనేది కథ. ముఖ్యమైన పాత్రలలో దిలీప్ రాజ్ .. శిల్పా మంజునాథ్ .. అపూర్వ భరద్వాజ్ .. కనిపించనున్నారు. 

Nimmavastugilage Neeve Javabdararu
Kannada crime drama
OTT release
Sun NXT
Keshav Murthy
Dileep Raj
Shilpa Manjunath
Apoorva Bharadwaj
Bangalore
Anthology movie

More Telugu News