Akkineni Nageswara Rao: దేవదాసుకు 72 ఏళ్లు.. స్పెషల్ వీడియో విడుదల

అక్కినేని నాగేశ్వరరావు క్లాసిక్ చిత్రం ‘దేవదాసు’ విడుదలై నేటికి 72 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. అక్కినేని ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు భారతీయ సినీ పరిశ్రమలో చరిత్ర సృష్టించారు. ‘జగమే మాయ.. బ్రతుకే మాయ’ అంటూ సాగే పాటకు నేటి తరంలోనూ అభిమానులు ఉన్నారు. కొన్ని కథలు ఎన్ని సంవత్సరాలు గడిచినా నిత్యనూతనంగా ఉంటాయనడానికి దేవదాసు కథే నిదర్శనమని అన్నపూర్ణ స్టూడియోస్ పేర్కొంది.