Lovely Malayalam Movie: మలయాళం 'ఈగ' .. గ్రాఫిక్స్ విషయంలో గడబిడ!

Lovely Movie Update
  • మ్యాథ్యూ థామస్ హీరోగా 'లవ్లీ'
  • రొమాంటిక్ ఫాంటసీ జోనర్లో రూపొందిన మూవీ 
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి 
  • గ్రాఫిక్స్ విషయంలో మొదలైన గడబిడ

మలయాళంలో 'లవ్లీ' అనే సినిమా రూపొందింది. మ్యాథ్యూ థామస్ హీరోగా నటించిన ఈ సినిమాకి దిలీష్ నాయర్ దర్శకత్వం వహించాడు. శరణ్య - అమర్ రామచంద్రన్ నిర్మించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 16వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 

హీరోకి .. ఒక 'ఈగ'కి మధ్య నడిచే కథ ఇది. కొన్ని కారణాల వలన హీరో జైలుకి వెళతాడు. అక్కడ అతనికి మాటలు వచ్చిన ఒక 'ఈగ' పరిచయమవుతుంది. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? ఆ తరువాత చోటుచేసుకునే మలుపులు ఎలాంటివి? అనేది కథ. అయితే 'ఈగ' వైపు నుంచి ఉపయోగించిన గ్రాఫిక్స్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. 

రాజమౌళి దర్శకత్వంలో 2012లో వచ్చిన 'ఈగ' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాలో 'ఈగ' కోసం చేసిన గ్రాఫిక్స్ ను యథాతథంగా 'లవ్లీ' సినిమాలో వాడారంటూ 'ఈగ' సినిమా మేకర్స్ ఆరోపిస్తున్నారు. 'లవ్లీ' సినిమా మేకర్స్ కి లీగల్ నోటీసులు కూడా పంపించారు. అయితే 'లవ్లీ' దర్శకుడు దిలీష్ నాయర్ మాత్రం కాపీ రైట్ ఆరోపణలను ఖండిస్తూ ఉండటం విశేషం. మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందనేది చూడాలి. 

Lovely Malayalam Movie
Mathew Thomas
Dilish Nair
Eega Movie
SS Rajamouli
Copyright Issue
Malayalam Cinema
Amazon Prime
Graphics
Telugu News

More Telugu News