Manchu Vishnu: 24 గంటల్లో 1,15,000 టికెట్ల అమ్మకం... నా హృదయం పరవళ్లు తొక్కుతోంది: మంచు విష్ణు

Manchu Vishnu Kannappa Sells 115000 Tickets in 24 Hours
  • రేపు (జూన్ 27) వరల్డ్ వైడ్ గా కన్నప్ప గ్రాండ్ రిలీజ్
  • విడుదలకు ముందే కన్నప్ప సంచలనం
  • కన్నప్ప' సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన
  • ఈ సినిమా విజయం శివుడికి, కన్నప్పకే అంకితమని వెల్లడి
నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం రేపు (జూన్ 27) విడుదల కానున్న నేపథ్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,15,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని, ఉద్వేగాన్ని పంచుకున్నారు.

ప్రేక్షకుల స్పందన చూసి హృదయం పరవళ్లు  తొక్కుతోందని, తన మనసు ఉద్వేగంతో నిండిపోయిందని తెలిపారు. సినిమా విడుదలకు ముందే ఇంతటి ఆదరణ, అభిమానం లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అచంచలమైన మద్దతు అందిస్తున్న ప్రతి సినీ ప్రేమికుడికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు విష్ణు వివరించారు.

ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఇది పూర్తిగా పరమేశ్వరుడికి, కన్నప్పకు చెందిన ఘనత అని తెలిపారు. ఈ విజయం, ఈ ఆదరణ అంతా వారికే అంకితమని విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. #HarHarMahadev అంటూ తన భక్తిని చాటుకున్నారు.

ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
Manchu Vishnu
Kannappa Movie
Telugu Cinema
115000 Tickets Sold
Mukesh Kumar Singh
Har Har Mahadev
Telugu Film Industry
Kannappa Release

More Telugu News