Nani: 1960 నేపథ్యంలోని కథ .. కోలీవుడ్ కి నాని?

karthi 29th Movie Update
  • వరుస సినిమాలతో బిజీగా కార్తీ 
  • లైన్లో 'సర్దార్ 2' - 'ఖైదీ 2' 
  • తమిళ్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ 
  • వచ్చేనెల నుంచి సెట్స్ పైకి 
  • కీలకమైన పాత్రలో నాని అంటూ టాక్

కోలీవుడ్ కి నాని .. ఓ తమిళ సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రను పోషించనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఇటీవల తెలుగులో నాని నటించిన 'హిట్ 3' సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కార్తీ ఒక కీలకమైన పాత్రలను పోషించాడు. 'హిట్ 4'లో హీరోగా చేసేది కార్తీనే. 

ఇక తమిళంలో తను చేసే సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయమని కార్తీ కోరడంతో నాని అందుకు అంగీకరించాడని అంటున్నారు. గతంలో వెట్రి మారన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన తమిళ్ ఈ సినిమాకి దర్శకుడు. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. 1960ల నాటి కాలంలో .. రామేశ్వరం సముద్రతీర నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని సమాచారం. 

ఇటీవలే 'సర్దార్ 2' సినిమాను పూర్తి చేసిన కార్తీ, ప్రస్తుతం 'ఖైదీ 2' సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. వచ్చే నెల నుంచి తమిజ్ ప్రాజెక్టుపైకి వెళతాడు. కెరియర్ పరంగా కార్తీకి ఇది 29వ సినిమా. ఈ సినిమా కోసం ఆల్రెడీ నివిన్ పౌలీనీ .. జయరామ్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాకి నాని ఓకే అనడంలో ఎంతవరకూ నిజముందనేదే తేలాలి. 

Nani
Karthi
Kollywood
Tamil cinema
Hit 3
Khaki 2
Tamil film industry
Tamil director
Rameshwaram

More Telugu News