Manchu Manoj: 'కన్నప్ప' చాలా బాగుంది.. ప్రభాస్ రాకతో సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది: మంచు మనోజ్

Manchu Manoj says Kannappa is amazing Prabhas entry takes film to next level
  • అన్నయ్య సినిమా 'కన్నప్ప'ను అభిమానుల మధ్య వీక్షించిన మంచు మనోజ్
  • సినిమా చాలా బాగుందని, ప్రతి ఒక్కరూ బాగా నటించారని ప్రశంసలు
  • ప్రభాస్ ఎంట్రీతో సినిమా స్థాయి మారిపోయిందని మనోజ్ కితాబు
మంచు విష్ణు హీరోగా, ఆయన తండ్రి మోహన్ బాబు నిర్మాణంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'కన్నప్ప' చిత్రం పాన్-ఇండియా స్థాయిలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తాజాగా మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ వీక్షించారు. అనంత‌రం ఆయ‌న‌ ఈ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కుటుంబ విభేదాల‌ను పక్కనపెట్టి మనోజ్ తన అన్న సినిమాను వీక్షించడం విశేషం.

హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో 'కన్నప్ప' సినిమా చూసిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని కొనియాడారు. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా మరో లెవెల్‌కు వెళుతుంది. చివ‌రి 20 నిమిషాలు అదిరిపోయింది. క్లైమాక్స్‌లో నటీనటులు ఇంత గొప్పగా నటిస్తారని కలలో కూడా ఊహించలేదు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ప్ర‌భాస్ యాక్టింగ్ అదిరింది. అన్న కూడా ఇంత బాగా చేస్తార‌ని అస్స‌లు ఊహించ‌లేదు. ఈ సినిమా ఘ‌న విజ‌యాన్ని అందుకోవాల‌ని ప్రార్థిస్తున్నా" అని మనోజ్ అన్నారు.
Manchu Manoj
Kannappa movie
Manchu Vishnu
Prabhas
Mohan Babu
Telugu cinema
Pan-India movie
Movie review
Imax Hyderabad

More Telugu News