YS Vijayamma: 'కన్నప్ప' సినిమా చూసిన వైఎస్ విజయమ్మ

YS Vijayamma Watches Kannappa Movie
  • ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన మంచు విష్ణు 'కన్నప్ప'
  • తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్
  • హైదరాబాదులోని ఏఎంబీ సినిమాస్‌లో చిత్రాన్ని వీక్షించిన వైఎస్ విజయమ్మ
  • హీరో మంచు విష్ణుతో కలిసి సినిమా చూసిన విజయమ్మ 
నటుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సానుకూల స్పందనను రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్థాంగి వైఎస్ విజయమ్మ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఎంబీ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ఆమె హాజరయ్యారు. హీరో మంచు విష్ణుతో కలిసి ఆమె 'కన్నప్ప' సినిమాను చూశారు. సినిమా విడుదల రోజే విజయమ్మ థియేటర్‌కు వచ్చి చిత్రాన్ని వీక్షించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, మంచు విష్ణు అర్ధాంగి వెరోనికా, వైఎస్ కుటుంబానికి చెందిన వారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కుటుంబ బంధం నేపథ్యంలోనే, విష్ణు నటించిన చిత్రాన్ని చూసేందుకు వైఎస్ విజయమ్మ ప్రత్యేక శ్రద్ధతో థియేటర్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. భారీ తారాగణంతో, ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన 'కన్నప్ప' చిత్రంపై సినీ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మొదటి నుంచి ఆసక్తి నెలకొని ఉంది. అందుకు తగ్గట్టుగానే రివ్యూలన్నీ దాదాపుగా పాజిటివ్ గానే వస్తున్నాయి.
YS Vijayamma
Kannappa Movie
Manchu Vishnu
YS Rajasekhara Reddy
Telugu Movie Review
AMB Cinemas
Veronica Manchu
Telugu Cinema
Kannappa Film

More Telugu News