Shafali Jariwala: గుండెపోటుతో 'కాంటా లగా' బ్యూటీ షఫాలీ జరివాలా కన్నుమూత

Shafali Jariwala Kaanta Laga Fame Actress Passes Away at 42 Due to Heart Attack
  • గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమిక సమాచారం
  • నిన్న‌ రాత్రి అస్వస్థత.. ఆసుపత్రిలో మృతి చెందినట్లు నిర్ధారణ
  • 'కాంటా లగా' పాటతో దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు
  • షఫాలీ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సింగర్ మికా సింగ్
‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) హఠాన్మరణం చెందారు. నిన్న రాత్రి ఆమె గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో చిత్ర పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో షఫాలీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి వెంటనే అంధేరిలో ఉన్న బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. షఫాలీ మరణ వార్తపై ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

2005లో విడుదలైన ‘కాంటా లగా’ రీమిక్స్ వీడియో సాంగ్‌తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఈ పాటతో ఆమెకు ‘కాంటా లగా గర్ల్’గా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన ‘ముజ్సే షాదీ కరోగి’ చిత్రంలో ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించారు. హిందీ బిగ్‌బాస్ సీజన్ 13తో పాటు పలు టీవీ రియాలిటీ షోలలోనూ ఆమె పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే షఫాలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 33 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఆకస్మిక మరణవార్త తెలిసి అభిమానులు, నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ గాయకుడు మికా సింగ్ స్పందిస్తూ, షఫాలీ మరణం తనను తీవ్ర షాక్‌కు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. నటుడు పరాగ్ త్యాగిని షఫాలీ 2015లో వివాహం చేసుకున్నారు.
Shafali Jariwala
Kaanta Laga
Parag Tyagi
Bigg Boss 13
Bollywood actress
Sudden death
Heart attack
Mika Singh
Mujhse Shaadi Karogi
Mumbai

More Telugu News