Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి ఓ కేసులో బెయిల్ .. మరో రెండు కేసుల్లో రిమాండ్, కస్టడీ

Kakani Govardhan Reddy Gets Bail in One Case Remand in Another
  • గ్రానైట్ అక్రమ తవ్వకాల కేసులో కాకాణికి బెయిల్ 
  • కనుపూరు చెరువు అక్రమ తవ్వకాల కేసులో 14 రోజుల రిమాండ్ 
  • అనధికార టోల్ గేట్ ఏర్పాటు కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి 
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వరుసగా పలు కేసులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఒక కేసులో కాకాణికి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, మరో కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. మరొక కేసులో ఆయనను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.

సర్వేపల్లి రిజర్వాయరులో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో రెండో అదనపు మెజిస్ట్రేట్ శారదారెడ్డి నిన్న కాకాణికి బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా, కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించిన కేసులో నెల్లూరు నాల్గవ అదనపు మెజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ కాకాణికి 14 రోజుల రిమాండ్ (అంటే జులై 11 వరకు) విధించారు. ప్రస్తుతం కాకాణి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఇదిలావుండగా, 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసిన కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి జూలై 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి, తిరిగి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణ సమయంలో కాకాణి తరపు న్యాయవాదిని అనుమతించాలని కోర్టు సూచించింది. 
Kakani Govardhan Reddy
Kakani
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Illegal Mining Case
Bail
Remand
Police Custody
Sarvepalli Reservoir

More Telugu News