Swetha Votarkar: న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యలో కొత్త కోణం.. స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలు

Swetha Votarkar Telugu News Anchor Suicide Father Accuses Live in Partner
  • హైదరాబాద్‌లో టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్‌ ఆత్మహత్య
  • సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రరావుపై తండ్రి తీవ్ర ఆరోపణలు
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమార్తె మృతికి ఆమెతో పాటు సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రరావు అనే వ్యక్తే కారణమంటూ స్వేచ్ఛ తండ్రి ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మానసికంగా వేధించడం వల్లే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె, తన కుమార్తెతో పాటు పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటున్నారు. 

"భర్తతో విడిపోయాక నా కూతురు పూర్ణచంద్రరావుతోనే ఉంటోంది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి సహజీవనం ప్రారంభించాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి" అని ఆయన పోలీసులకు వివరించారు.

జూన్ 26న తన కుమార్తె ఫోన్ చేసిందని స్వేచ్ఛ తండ్రి తెలిపారు. "పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేను నాన్న, చాలా గొడవలు అవుతున్నాయి అని చెప్పి బాధపడింది. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడం వల్లే నా కూతురు తీవ్ర మనస్తాపానికి గురై చనిపోయింది. అతడిని కఠినంగా శిక్షించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పూర్ణచంద్రరావుపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.

Swetha Votarkar
Swetha Votarkar suicide
Telugu news anchor
Purna Chandra Rao
live in relationship
Chikkadpally police
Jawahar Nagar
domestic issues
suicide case
Hyderabad news

More Telugu News