Alipiri: అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. వీడియో ఇదిగో!

Tirumala Rush Devotees Flock to Tirumala Alipiri Traffic Jam
  • తిరుమలలో వెల్లువెత్తిన భక్తజనం.. వాహన తనిఖీల్లో తీవ్ర జాప్యం
  • అలిపిరి వద్ద కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు
  • రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతులతో మరింత ఆలస్యం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. భక్తులు గంటల తరబడి వాహనాల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

తిరుమలకు ప్రవేశ ద్వారమైన అలిపిరి వద్ద వాహనాల తనిఖీ ప్రక్రియ ఆలస్యం కావడంతో, వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అలిపిరి గరుడ కూడలి వరకు వాహనాల వరుసలు కనిపిస్తున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు, తిరుమలకు వెళ్లే రెండో కనుమ రహదారిలో మరమ్మతు పనులు జరుగుతుండటం కూడా ట్రాఫిక్ నెమ్మదించడానికి ఒక కారణంగా తెలుస్తోంది. ఈ మరమ్మతుల వల్ల ఆ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. వారాంతపు రద్దీకి ఘాట్ రోడ్డు మరమ్మతులు తోడవడంతో, శ్రీవారి భక్తులకు ప్రయాణంలో తీవ్ర జాప్యం తప్పడం లేదు. అధికారులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిస్థితి అదుపులోకి రావడం లేదు.

Alipiri
Traffic jam
Tirumala
Tirumala rush
Lord Venkateswara
Weekend rush
Tirupati
Ghat road repair

More Telugu News