Revanth Reddy: మహాటీవీ ఆఫీసుపై దాడి.. తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Condemns Attack on Mahaa TV Office
  • మహాటీవీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన
  • తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • దాడిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి
  • ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సమర్థనీయం కాదన్న ముఖ్యమంత్రి
  • దాడిని ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ మహాటీవీ కార్యాలయంపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. మీడియా సంస్థపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులకు ఏమాత్రం తావులేదని రేవంత్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.

మహా న్యూస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు ఎటువంటి స్థానం లేదని, మీడియా సంస్థలపై దాడులు చేయడం అంటే ప్రజల అభిప్రాయ స్వేచ్ఛను అణచివేయాలనే దురుద్దేశంతో కూడిన చర్య అని ఆయన అన్నారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ ఘటనను నిర్దాక్షిణ్యంగా చూడాలని, ఈ దాడిలో పాలుపంచుకున్నవారితో పాటు, ఈ ​దాడి వెనుక నిలిచినవారినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సూచిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడడమే మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.
Revanth Reddy
Mahaa TV
Telangana
Komati Reddy Venkat Reddy
Attack on Mahaa TV office

More Telugu News