Chandrababu Naidu: నేడు టీడీపీ నేతలతో కీలక సమావేశం .. ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Guide TDP Leaders on Door to Door Campaign Today
  • చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
  • జులై 2 నుంచి ఇంటింటి ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు, లోకేశ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జులై 2 నుంచి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు హాజరుకానున్నారు. దాదాపు నెల రోజుల పాటు కూటమి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే దానిపై పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే టీడీపీ కమిటీలు, కొత్త కార్యవర్గం ఇతర అంశాలపైనా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. 
Chandrababu Naidu
TDP
Andhra Pradesh
ఇంటింటి ప్రచారం
Nara Lokesh
TDP Meeting
AP Politics
Coalition Government
Welfare Schemes

More Telugu News