Factory Blast: పాశమైలారంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 20 మందికి గాయాలు

--
సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈ ఫ్యాక్టరీలో కెమికల్ రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తం 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.