Aamir alcohol addiction: ఆ సమయంలో చనిపోవాలని అనుకున్నా.. ఆమిర్ ఖాన్

Aamir Khan Opens Up About Depression After Reena Dutta Divorce
  • రీనాతో విడాకుల తర్వాత డిప్రెషన్‌ తో దేవదాసునయ్యానన్న ఆమిర్
  • రోజూ ఫుల్ బాటిల్ తాగేవాడినని వెల్లడించిన బాలీవుడ్ నటుడు
  • `లగాన్` ఘనవిజయం సాధించినా వ్యక్తిగతంగా కుంగిపోయానని ఆవేదన
  • ఆ దశ తన జీవితంలో అత్యంత చీకటి రోజులని భావోద్వేగం
  • ఒక ఇంటర్వ్యూలో పాత గాయాలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతం 
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత బాధాకరమైన చీకటి రోజుల గురించి తొలిసారి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్, తాగుడుకు బానిసయ్యానని ఆయన వెల్లడించారు. ‘లగాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచిన సమయంలోనే, తెరవెనుక తాను మానసిక నరకాన్ని అనుభవించానని ఆయన భావోద్వేగంతో తెలిపారు.

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ, "2002లో రీనాతో విడిపోయిన తర్వాత నా జీవితం తలకిందులైంది. ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం సేవించేవాడిని. తాగి స్పృహ కోల్పోయేవాడిని తప్ప నిద్రపోయేవాడిని కాదు. నన్ను నేను నాశనం చేసుకోవాలని ప్రయత్నించా. ఆ సమయంలో నేను ఏ సినిమా కూడా చేయలేదు, ఎవరినీ కలవలేదు. కానీ అదే ఏడాది ‘లగాన్’ విడుదలై, ఓ పత్రిక నన్ను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది. అది నాకు చాలా వైరుధ్యంగా అనిపించింది" అని కన్నీటి పర్యంతమయ్యారు.

రీనా దత్తాతో ఆమిర్ ఖాన్‌కు 16 ఏళ్ల పాటు వివాహ బంధం ఉంది. వారికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల తర్వాత కూడా ఒకరిపై ఒకరు గౌరవాన్ని కోల్పోలేదని ఆమిర్ గతంలో తెలిపారు. రీనాతో విడిపోయాక 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్న అమీర్, 2021లో ఆమెతో కూడా విడిపోయారు. అయినప్పటికీ ఇద్దరు మాజీ భార్యలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ తన పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నారు.
Aamir alcohol addiction
Aamir Khan
Reena Dutta
Aamir Khan divorce
Lagaan movie
Bollywood actor
depression
Kiran Rao
Junaid Khan
Ira Khan

More Telugu News