Relangi Narasimha Rao: 'అమ్మా' అని నేను పిలిచాకే ప్రాణం వదిలేసింది: దర్శకుడు రేలంగి నరసింహారావు

Relangi Narasimha Rao Interview
  • దాసరిగారే తన గురువన్న రేలంగి నరసింహారావు 
  • 76 సినిమాలు చేశానని వెల్లడి 
  • తల్లిపై కోపం వచ్చిందని ప్రస్తావన 
  • అమ్మప్రేమ అలాంటిదంటూ వివరణ

హాస్య కథాచిత్రాల దర్శకుడిగా రేలంగి నరసింహారావుకి మంచి పేరు ఉంది. దాసరి నారాయణరావు  దగ్గర అసిస్టెంట్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఆయన, ఆ తరువాత 76 చిత్రాల దర్శకుడిగా నిలిచారు. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా అత్యధిక చిత్రాలను అందించిన ఘనత ఆయన ఖాతాలో కనిపిస్తుంది.  తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"ఒకసారి నేను .. మా బ్రదర్ పోట్లాడుకుంటే మా మదర్ అతణ్ణి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. నిజానికి తప్పు మా బ్రదర్ దే అయినా అతణ్ణే సమర్ధించింది అనే కోపంతో నేను మా అమ్మతో మాట్లాడటం మానేశాను. ఆమెను 'అమ్మా' అని పిలవడం కూడా మానేశాను. ఆ తరువాత కొంతకాలానికి అమ్మకి జబ్బు చేసింది. ఆమె చనిపోయిందని కబురు వస్తే వెంటనే బయల్దే వెళ్లాను" అని అన్నారు. 

" నేను వెళ్లేసరికి షామియానా వేసి ఉందిగానీ, అక్కడ అమ్మ భౌతికకాయం లేదు. అంతకుముందే ఆమెకి మళ్లీ ప్రాణం రావడంతో లోపలి తీసుకుని వెళ్లారని చెప్పారు. 'హమ్మయ్య' అనుకుంటూ లోపలికి వెళ్లాను. నన్ను చూడగానే, ఒకసారి 'అమ్మా' అని పిలవమని అమ్మ సైగ చేసింది. నాకు కళ్లవెంట నీళ్లొచ్చాయి. 'అమ్మా' అని పిలవగానే ఆమె చాలా హ్యాపీగా ఫీలైంది. ఆ వెంటనే ఆమె చనిపోయింది. నాతో అలా పిలిపించుకోవడం కోసమే ఆమె అప్పటివరకూ బ్రతికిందేమో అనిపించింది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 

Relangi Narasimha Rao
Director Relangi Narasimha Rao
Telugu cinema director
Rajendra Prasad movies
Dasari Narayana Rao assistant
Mother sentiment
Telugu movies
Comedy movies

More Telugu News