Kubera: 'మాదే ఈ సోకమంతా'.. 'కుబేర' వీడియో సాంగ్ వ‌చ్చేసింది!

Kubera Movie Video Song Maade Ee Sokamanta Released
  • ధనుశ్‌, నాగార్జునల 'కుబేర' చిత్రం నుంచి కొత్త అప్‌డేట్
  • 'మాది.. మాది.. మాదే ఈ సోకమంతా' అంటూ సాగే వీడియో సాంగ్ విడుదల
  • దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు.. నంద కిషోర్ సాహిత్యం
  • పాటలో ధనుశ్‌ నటన ప్రత్యేక ఆకర్షణ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ సాంగ్
దర్శకుడు శేఖర్ కమ్ముల, నటుడు ధనుశ్‌ కలయికలో వచ్చిన‌ చిత్రం ‘కుబేర’. కింగ్ అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించిన‌ ఈ సినిమా ఈ నెల 20న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

‘మాది.. మాది.. మాదే ఈ సోకమంతా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు పాటకు ప్రాణం పోయగా, నంద కిషోర్ రాసిన సాహిత్యం ఆలోచింపజేసేలా ఉంది. ముఖ్యంగా ఈ పాటలో ధనుశ్‌ తన అద్భుతమైన హావభావాలతో, నటనతో మరోసారి అందరినీ కట్టిపడేశారు.

శేఖర్ కమ్ముల తనదైన సున్నితమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోగా, ధనుశ్ విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. అంచ‌నాల‌ను త‌గ్గ‌ట్టుగానే మూవీ అంద‌రినీ అల‌రించింద‌నే చెప్పాలి. క‌లెక్ష‌న్ల ప‌రంగానూ సినిమా దూసుకెళ్లింది. రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

Kubera
Dhanush
Sekhar Kammula
Nagarjuna
Rashmika Mandanna
Devi Sri Prasad
Telugu movie
video song
Maade Ee Sokamanta
box office collection

More Telugu News