Chevireddy Bhaskar Reddy: కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు... జైలు వద్ద చెవిరెడ్డి తీవ్ర భావోద్వేగం

Chevireddy Bhaskar Reddy Taken Into Custody by SIT in Liquor Scam
  • లిక్కర్ స్కామ్ లో సిట్ కస్టడీకి చెవిరెడ్డి
  • తనను అన్యాయంగా జైలుకు పంపారన్న చెవిరెడ్డి
  • దేవుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు వెంకటేశ్ నాయుడులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఈ ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించేందుకు ఏసీబీ కోర్టు నిన్న అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, సిట్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

విజయవాడ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న వీరిద్దరినీ సిట్ అధికారులు ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరపాల్సి ఉంది. ఈ మూడు రోజుల విచారణలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నించనున్నారు.

జైలు వద్ద చెవిరెడ్డి భావోద్వేగం

విజయవాడ సబ్ జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, "తప్పుడు కేసులు పెట్టి నన్ను అన్యాయంగా జైలుకి పంపారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది" అని వ్యాఖ్యానించారు.
Chevireddy Bhaskar Reddy
Andhra Pradesh
Liquor Scam
YSRCP
SIT Investigation
Vijayawada
ACB Court
Venkatesh Naidu
Political Conspiracy
False Cases

More Telugu News