Madras Matinee: ఓటీటీ సెంటర్ కి 'మద్రాస్ మ్యాటినీ'

Madras Maatinee Movie Update
  • తమిళంలో రూపొందిన 'మద్రాస్ మ్యాటినీ'
  • ప్రధానమైన పాత్రలో కనిపించే సత్యరాజ్
  • మధ్య తరగతి మనుషుల చుట్టూ తిరిగే కథ  
  • ఈ నెల 4వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో   

మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబిస్తూ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో ఒకటిగా 'మద్రాస్ మ్యాటినీ' కనిపిస్తుందని చెప్పొచ్చు. తమిళంలో రూపొందిన ఈ సినిమాకి కార్తికేయన్ మణి దర్శకత్వం వహించాడు. సత్యరాజ్ .. కాళీ వెంకట్ .. రోషిణి హరిప్రియన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జూన్ 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సన్ నెక్స్ట్'వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా వాళ్లు అధికారికంగా ప్రకటించారు. ఓటీటీలలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ తో పాటు, కామెడీ టచ్ తో సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అందువలన ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే .. జ్యోతిరామయ్య అనే ఒక పేరున్న రచయిత, ఎప్పుడూ కూడా సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన పుస్తకాలు రాస్తూ ఉంటాడు. మధ్యతరగతి జీవితాలలో ఎలాంటి అద్భుతాలు జరగవనీ, నిరాశతో .. నిస్సారంగా నడుస్తాయనేది ఆయన ఆలోచన. అలాంటి ఆయన ఒక సందర్భంలో, మధ్యతరగతికి చెందిన ఆటోడ్రైవర్ 'కన్నన్' కథను రాయాలనుకుంటాడు. అప్పుడు ఆయనకి ఎదురయ్యే అనుభవాలే ఈ కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి మరి.    

Madras Matinee
Sathyaraj
Kali Venkat
Roshini Haripriyan
Tamil Movie
OTT Release
Sun Nxt
Movie Review
Family Drama
Karthikeyan Mani

More Telugu News