Avinash Varma: పాత్రల వెంట పరుగులు పెట్టించే రొమాంటిక్ థ్రిల్లర్ .. ఓటీటీలో!

Jagamerigina Sathyam
  • హీరోగా రవితేజ మేనల్లుడి పరిచయం 
  • దర్శకుడికి కూడా ఇదే ఫస్టు మూవీ
  • సన్ నెక్స్ట్ వారు దక్కించుకున్న ఓటీటీ రైట్స్  
  • ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్    

ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'జగమెరిగిన సత్యం'. టైటిల్ చూసి ఇదేదో గ్రామీణ నేపథ్యంలో జరిగే ఉద్యమాలకు సంబంధించిన కథ అనుకుంటే పొరపాటే. కలవారి అమ్మాయికి .. పేదోడి ప్రేమకి మధ్య నడిచే కథ. ఇలాంటి కథతో రూపొందిన ఈ సినిమా, ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. కాకపోతే సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయింది. 

అలాంటి ఈ సినిమా ఈ నెల 4వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్' ద్వారా ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 1994 కాలంలో .. తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ సినిమాతో హీరోగా అవినాశ్ వర్మ పరిచయమయ్యాడు. ఇతను హీరో రవితేజకి మేనల్లుడు కావడం విశేషం. దర్శకుడు పాలే తిరుపతికి కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో కథానాయికలుగా ఆద్య రెడ్డి - నీలిమ నటించారు. 

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో ఈ కథ నడుస్తుంది. పేదింటికి చెందిన సత్యం, సర్పంచ్ మేనకోడలు అయిన సరితను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఈ విషయం సర్పంచ్ కి తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అనేది కథ. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. 

Avinash Varma
Jagamerigina Satyam
Telugu movie
Sun NXT
Romantic thriller
Aadya Reddy
Neelima
Palie Thirupathi
Ravi Teja nephew
OTT release

More Telugu News