Jagan: జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ

Jagan Quash Petition Hearing Today
  • రెంటపాళ్ల కేసులో జగన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • రాజకీయ ప్రతీకారంతోనే కేసు పెట్టారని జగన్ ఆరోపణ
  • కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్
వైసీపీ అధినేత జగన్ పై నమోదైన రెంటపాళ్ల కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని, దానిని కొట్టివేయాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం వాదనలు విననుంది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో ఇటీవల జగన్‌ పర్యటిస్తున్న సమయంలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడిపోయి చనిపోయాడు. ఈ నేపథ్యంలో జగన్ సహా పలువురిపై కేసు నమోదయింది. ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదిగా పేర్కొంటూ జగన్‌ ఇతర నిందితులు కోర్టును ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును రద్దు చేయాలని కోరుతూ వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేయగా, వాటన్నింటినీ కలిపి ఉన్నత న్యాయస్థానం విచారిస్తోంది.
Jagan
YS Jagan
Jagan Mohan Reddy
Rentapalla case
Andhra Pradesh High Court
Quash Petition
YSRCP
Political Vendetta
Singaiah

More Telugu News