Revanth Reddy: పాశమైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Inspects Pashamylaram Factory
  • ఫ్యాక్టరీని గతంలో ఎప్పుడు తనిఖీ చేశారని అధికారులకు ప్రశ్న
  • ప్రమాదానికి కారణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • సీఎంతో పాటు మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, పొంగులేటి
పాశమైలారంలో పేలుడు సంభవించిన సిగాచీ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రాణనష్టం ఎక్కువగా ఉండడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు సిగాచీ ఫ్యాక్టరీని ఎప్పుడు తనిఖీ చేశారని అధికారులను ప్రశ్నించారు. ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణం కనిపెట్టాలని ఆదేశించారు. నిపుణులతో దర్యాప్తు జరిపించి పేలుడుకు కారణమేంటనే వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పోశమైలారం సిగాచీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొంగులేటి, దామోదర రాజనర్సింహ తదితరులు వెంట ఉన్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
Revanth Reddy
Pashamylaram
Sigaachi factory
Telangana CM
Vivek Venkataswamy
Sridhar Babu
Ponguleti
Damodara Rajanarasimha
Factory explosion
Telangana news

More Telugu News