Vijay Babu: సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు: నటుడు విజయ్ బాబు

Vijay Babu Interview
  • నటుడిగా విజయ్ బాబుకి మంచిపేరు 
  • చాలాకాలంగా సీరియల్స్ తో బిజీ
  • సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టమని వెల్లడి 
  • సక్సెస్ కి మాత్రమే విలువ ఉంటుందని వివరణ

విజయ్ బాబు .. ఒకప్పుడు సినిమాలలో నటించిన ఆయన, చాలా కాలంగా సీరియల్స్ తో బిజీగా ఉంటూ వస్తున్నారు. నటుడిగా 50 ఏళ్ల కెరియర్ ను చూసిన ఆయన, తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన గురించి .. మారుతూ వస్తున్న సినిమాను గురించి ప్రస్తావించారు. "సినిమా అనేది ఇప్పుడు ఒక మాయా ప్రపంచమేనని చెప్పాలి. ఇప్పుడు పాటలోనైనా .. ఫైట్ లో నైనా గ్రాఫిక్స్ వాడుతున్నారు. ఒకప్పుడు అలా లేదు. అందువల్లనే అప్పటివాళ్లు స్టార్స్ గా నిలబడ్డారు" అని అన్నారు. 

మనకి సంబంధించిన చాలా పనులు మన చేతిలో ఉంటాయి. కానీ సినిమా అలా కాదు. నేను ఎంత బాగా చేసినప్పటికీ, దానిని బాగా తీసే దర్శకుడు కావాలి .. ప్రమోషన్స్ బాగా చేసే నిర్మాత ఉండాలి. భారీ స్థాయిలో రిలీజ్ చేయగలగాలి .. రిలీజ్ సమయంలో వాతావరణం అనుకూలించాలి .. రిలీజ్ అయిన తరువాత అది భారీ విజయాన్ని సాధించాలి. ఇవన్నీ దాటుకుని ఒక నటుడికి క్రేజ్ రావాలంటే అందుకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నేను నమ్ముతాను" అని అన్నారు. 

"సినిమా అంతా కూడా హీరో మీదనే నడుస్తుంది. హీరోకి వరుసగా ఫ్లాప్ లు పడితే ఎవరూ పిలవరు. ఎప్పుడూ కూడా సినిమాకి విలువ ఉండదు .. మార్కెట్ కి మాత్రమే విలువ ఉంటుంది. మార్కెట్ లేకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. ట్రీట్మెంట్ పూర్తి తేడాగా ఉంటుంది. నాకు అన్నం లేకపోయినా ఫరవాలేదు .. మర్యాద కావాలి. ఎదుటివారికి నేను గౌరవం ఇస్తాను .. అలాగే నన్ను గౌరవించాలని కోరుకుంటాను .. తప్పులేదుగా" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు.

Vijay Babu
Telugu actor
Telugu serials
Tollywood
Telugu cinema
Movie success
Film industry
Acting career
Telugu films
Movie market value

More Telugu News