INS Tabar: నౌకలో అగ్ని ప్రమాదం .. అందులో చిక్కుకున్న వారిని కాపాడిన ఐఎన్ఎస్ తాబర్

- ఉత్తర అరేబియా సముద్రంలో పలావ్ దేశానికి చెందిన నౌకలో అగ్నిప్రమాదం
- రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ తాబర్
- నౌకలో చిక్కుకున్న వారిని కాపాడి, మంటలను అదుపు చేసిన తాబర్ సిబ్బంది
పలావ్ దేశానికి చెందిన ఓ నౌక ఉత్తర అరేబియా సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని కాండ్లా నుంచి ఒమన్‌లోని షినాస్‌కు వెళ్తుండగా ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకున్న సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. ఈ మేరకు నేవీ ఓ ప్రకటనలో తెలిపింది.
జూన్ 29వ తేదీ తెల్లవారుజామున ఎంటీఈ చెంగ్ 6 నౌకలో అగ్ని ప్రమాదం సంభవించిందని, అందులో 14 మంది భారతీయ సిబ్బందితో పాటు మరికొందరు ఉన్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. నౌకలో అగ్నిప్రమాదం గురించి సమాచారం (మేడే కాల్) అందడంతో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మోహరించి ఉన్న ఐఎన్ఎస్ తాబర్ రంగంలోకి దిగింది.
యూఏఈకి 80 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఎంటీఈ చెంగ్ 6 నౌక వద్దకు ఐఎన్ఎస్ తాబర్ వెంటనే వెళ్లింది. ఆ నౌకలో ఉన్న వారిని తాబర్ నౌక సిబ్బంది క్షేమంగా కాపాడారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇండియన్ నేవీ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.