Paramasivan Fatima: ఓటీటీలో తమిళ హారర్ థ్రిల్లర్ .. ఆత్మలు చేసే హత్యలు!

Paramashivan Fathima Movie Update
  • తమిళంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ 
  • ప్రధానమైన పాత్రల్లో విమల్ - ఛాయాదేవి 
  • రెండు గ్రామాల చుట్టూ తిరిగే కథ 
  • ఈ నెల 4 నుంచి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్

హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలను తెరకెక్కించడంలో తమిళ దర్శకులకు మంచి నైపుణ్యం ఉంది. అందువలన తమిళం నుంచి వచ్చే ఈ తరహా జోనర్ కి సంబంధించిన సినిమాలను చూడటానికి ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాంటి వారందరి ముందుకు ఇప్పుడు మరో తమిళ హారర్ థ్రిల్లర్ రానుంది .. ఆ సినిమా పేరే 'పరమశివన్ ఫాతిమా'. 

తమిళంలో రూపొందిన ఈ సినిమాలో విమల్ - ఛాయాదేవి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇసక్కి కర్వన్నన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, జూన్ 6వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 4వ తేదీ నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ కానుంది. మనోజ్ కుమార్ .. శ్రీరంజని .. అరుళ్ దాస్ .. కూల్ సురేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే, పక్క పక్కనే ఉన్న రెండు గ్రామాలలో మతపరమైన గొడవలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు మతాల వారికి సంబంధించిన హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆత్మలు చేస్తున్న హత్యలుగా భావిస్తూ అంతా భయపడుతూ ఉంటారు. అసలు కారణం అదేనా? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కథ ముందుకు వెళుతుంది. ఓటీటీ వైవు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి మరి. 


Paramasivan Fatima
Tamil horror thriller
OTT movies
Vimal
Chaya Devi
Isakki Karvannan
Aha Tamil
Religious conflicts
Ghost killings
Tamil cinema

More Telugu News