Nithiin: 'తమ్ముడు'లో సక్సెస్ కళ కనిపిస్తుందే!

THammudu Movie Special
  • నితిన్ తాజా చిత్రంగా 'తమ్ముడు'
  • చాలా గ్యాప్ తరువాత 'లయ' రీ ఎంట్రీ  
  • టాలీవుడ్ కి పరిచయమవుతున్న సప్తమి గౌడ 
  • ప్రత్యేక ఆకర్షణగా అజనీశ్ లోక్ నాథ్ సంగీతం
  • ఈ నెల 4వ తేదీన భారీ రిలీజ్ 

నితిన్ అభిమానులంతా ఇప్పుడు 'తమ్ముడు' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 'భీష్మ' హిట్ తరువాత నితిన్ కి ఇంతవరకూ మరో హిట్ పడలేదు. అందువలన అభిమానులంతా కూడా 'తమ్ముడు' పై ఆశలు పెట్టుకున్నారు. 75 కోట్లతో దిల్ రాజు నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. గ్రామీణ నేపథ్యం .. అక్కాతమ్ముళ్ల అనుబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. 

ఈ సినిమాలో నితిన్ 'విలువిద్య'కి సంబంధించిన క్రీడా కారుడిగా కనిపించనున్నాడు. శత్రు సంహారం కోసం కూడా ఆయన విలువిద్యనే నమ్ముకోవడం ఈ సినిమాలో కొత్తగా అనిపించే అంశం. అక్కకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఒక తమ్ముడు ఏం చేస్తాడు? అనేదే ఈ సినిమాలోని ప్రధానమైన కథాంశం. 'మాట నిలబెట్టుకున్నప్పుడే మనిషి బ్రతికున్నట్టు' అనే కోణంలో నితిన్ పాత్ర కొనసాగుతుంది. నితిన్ పాత్రను ప్రేరేపించే అక్క పాత్రలో లయ కనిపించనుంది. చాలా కాలం తరువాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది.  

ఇక నితిన్ సరసన సప్తమి గౌడ మెరవనుంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ఇదే. 'వకీల్ సాబ్'తో హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ నుంచి వస్తున్న ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించాడు. ఆయన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందని భావిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్ దేవా విలన్ గా నటించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన థియేటర్లకు రానుంది. 'తమ్ముడు'కి గల ప్రత్యేకతల కారణంగా ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అదే జరుగుతుందేమో చూడాలి మరి. 

Nithiin
Thammudu Movie
Nithiin Thammudu
Dil Raju
Sapthami Gowda
Laya
Venu Sriram
Telugu Movie
Ajaneesh Loknath
Archery

More Telugu News