Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై పుకార్లు... స్పందించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan OG Movie Release Date Confirmed by DVV Entertainment
  • ఓజీ’ సినిమా వాయిదా వదంతులకు తెరదించిన చిత్ర బృందం
  • ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 25న విడుదల అని స్పష్టత
  • సోషల్ మీడియా ద్వారా ధృవీకరించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG) విడుదల తేదీపై నెలకొన్న అనుమానాలకు చిత్ర నిర్మాణ సంస్థ తెరదించింది. ఈ  సినిమా రిలీజ్ డేట్ పై వస్తున్న ఊహాగానాలపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ స్పందించింది. చెప్పిన తేదీకే 'ఓజీ' వస్తుందని స్పష్టం చేసింది.

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులపై ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వివరణ ఇచ్చింది. ‘ఓజీ’ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అభిమానులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. దీంతో సినిమా విడుదల తేదీపై పూర్తి స్పష్టత వచ్చినట్లయింది. ఈ చిత్రంలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపించనుండగా, ఆయన సరసన ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Pawan Kalyan
OG Movie
DVV Entertainment
Sujeeth
Priyanka Mohan
Imran Hashmi
Telugu cinema
Gangster action thriller
Release date
Tollywood

More Telugu News