Keerthy Suresh: రేపు ఓటీటీకి వస్తున్న కీర్తి సురేశ్ న్యూ మూవీ!

Uppu Kappurambu Movie Update
  • అమెజాన్ ప్రైమ్ లో కీర్తి సురేశ్ మూవీ
  • కామెడీ డ్రామా జోనర్లో సాగే కంటెంట్ 
  • గ్రామీణ నేపథ్యంలో కథాకథనాలు 
  • ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్

తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. హిందీలోను గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి సురేశ్ సినిమా ఏదీ దగ్గరలో లేదే అని ఆమె అభిమానులు అనుకుంటూ ఉండగా, 'ఉప్పుకప్పురంబు'  సినిమా పోస్టర్స్ తో ఆమె సడన్ షాక్ ఇచ్చింది. సుహాస్ తో పాటు ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టారు .. ఎప్పుడు పూర్తయింది అని అంతా ఆశ్చర్యపోతున్నారు. 

అయితే నిజంగానే ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను వాయిదాల పద్ధతిలో రివీల్ చేసేంత సమయం లేదు. ఎందుకంటే ఈ సినిమాను 28 రోజులలోనే పూర్తి చేశారు. ఇది ఈ సినిమా టీమ్ చెప్పిన మాటనే. ఈ సినిమా కోసం సుహాస్ 20 రోజులు .. కుర్తి సురేశ్ 18 రోజలు మాత్రమే కేటాయించారట. పక్కా ప్లానింగ్ తో పూర్తి చేశాం .. అవుట్ పుట్ గురించిన డౌటే అవసరం లేదంటుంది టీమ్. 

ఈ సినిమాను నేరుగా 'అమెజాన్ ప్రైమ్' లో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలు కానుంది. రాధిక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి, ఐవీ శశి దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది చూడాలి మరి. 
Keerthy Suresh
Uppu Kappurambu
Telugu movies
Amazon Prime
Suhas
Radhika
IV Sasi
OTT release
comedy drama
new movie

More Telugu News