KCR: యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

- వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
- వెంట భార్య శోభ, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్
- గతంలోను ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం నాడు యశోద ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట ఆయన భార్య శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. కేసీఆర్ గతంలోనూ యశోద ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడం తెలిసిందే.
అంతేకాకుండా, గత నెలలో కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు వరుసగా రెండు రోజుల పాటు పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఏఐజీ ఆసుపత్రిలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.