MV Krishna Reddy: ఏపీ మెగా డీఎస్సీ... పలు పరీక్షల 'కీ'లను విడుదల చేసిన విద్యాశాఖ

AP Mega DSC Key Released by Education Department
  • జూన్ 6 నుంచి 28 వరకు జరిగిన డీఎస్సీ పరీక్షలు
  • నేటి నుంచి అందుబాటులో 'కీ'లు 
  • అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచిన అధికారులు
  • 'కీ'పై అభ్యంతరాల స్వీకరణకు జులై 11 తుది గడువు
  • మిగిలిన పరీక్షల 'కీ' కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. మెగా డీఎస్సీలో భాగంగా పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక 'కీ'లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో పాటు ఈ 'కీ'లను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

జూన్ 6వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య జరిగిన పరీక్షల ప్రాథమిక 'కీ'లను ప్రస్తుతం అందుబాటులో ఉంచినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, పీఈటీ సహా పలు విభాగాలకు చెందిన కీలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ 'కీ'లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, సరైన ఆధారాలతో జులై 11వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు.

మరోవైపు, జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక 'కీ'లను, రెస్పాన్స్ షీట్లను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారంతో డీఎస్సీ పరీక్షలన్నీ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, తదుపరి ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసింది.
MV Krishna Reddy
AP DSC
Mega DSC
AP Teacher Recruitment
School Assistant
TGT
PGT
PET
AP Education Department
DSC Key Objections

More Telugu News